One Tv News - NEWS / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వానర మారుతి స్వయంభు దివ్య క్షేత్రం లో ఆంజనేయ స్వామి దీక్ష స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని కందికొండ సాయిబాబా గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారుl సాయిబాబా గురుస్వామి మాట్లాడుతూ... మా ఇంట్లో వాయు మూలన తెల్లవారు జామున మూడు గంటలకి ఒక వానరము (కోతి) వచ్చి చనిపోవడం జరిగినది. అప్పుడు 30 కోతులు అక్కడికి వచ్చి గంట సేపు ఏడ్చినవి. సాక్షాత్తూ ఆంజనేయస్వామి మాఇంటికి వచ్చాడని భావించి ,మా గ్రామస్తులకు మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు తెలియపరచడం జరిగింది . ఊరంతా కలిసి పసుపు కుంకాలతో ఊరేగింపు చేసి ఖననం చేయడం జరిగింది .అప్పటినుంచి ఎన్నో అద్భుతాలు మహిమలు జరుగుతున్నాయి. అలాగే రెండో అద్భుతం ఆ స్వామివారిని ప్రతిష్టించడానికి 104 రోజులు దీక్ష చేస్తుంటే 54వ రోజు మంగళవారం కొబ్బరికాయలో లక్ష్మీ నరసింహ స్వామి సింహం అవతారం మరియు వానర రూపం, మహా లక్ష్మి అమ్మవారి రూపం కలిసి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ అద్భుతాన్ని 250 మందిమీ చూశాము.
తెలంగాణలోని వేద పండితులు ఇక్కడకు వచ్చి ఆశ్చర్యపోయి పూజలు నిర్వహించి ఇది మహా పుణ్యక్షేత్రంగా కాబోతుందన తెలిపారు. అలాగే మూడవ అద్భుతం ఈ దేవాలయంలో కి ఒక వానరం వచ్చి స్పృహ కోల్పోయి పడి ఉన్నది ఆ వానరానికి తొమ్మిది రోజులు డాక్టర్లు వైద్య సేవలు చేశారు.
One Tv News