One Tv News - NEWS / విజయనగరం జిల్లా : ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా, హోస్పేట్ తాలూకా, నాగేనహళ్లి గ్రామం, ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ బసప్ప గడ్డద్ ఇటీవల BRCS కబ్బర్‌పేట ప్రభుత్వం పాఠశాలకు బదిలీ అయ్యారు. సోమవారం స్కూల్ నుంచి నిర్ణీత పాఠశాలకు హాజరయ్యేందుకు పాఠశాల డ్యూటీ నుండి విడుదలైన విషయం తెలిసిన వెంటనే, పిల్లలు తమ అభిమాన ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ కావడంతో భాఉద్వేగానికి లోనయ్యారు మరియు ఏడుస్తూ సార్ ఇక్కడే ఉండాలని అభ్యర్థించారు.
తమ అభిమాన ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేయడంతో పిల్లలు ఉపాధ్యాయుడిని ఆపి కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల పట్ల ఎంతో శ్రద్ధతో పనిచేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను బదిలీ చేయడం మాకు తీరని లోటు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
One Tv News