One Tv News - NEWS / విశాఖ జిల్లా : విశాఖ నగరంలో మరోసారి మత్తు ఇంజక్షన్ల వ్యవహారం కలకలం రేపాయి. మత్తు ఇంజక్షన్లు భారీగా పట్టుబడ్డా యి. వారం రోజులు గడవక ముందే విశాఖ నగరంలో 2,100 మత్తు ఇంజక్షన్లు పట్టుబడ్డాయి. నగర పరీధి లోని పెందుర్తి లో మరో 100 ఇంజక్షన్లను సెబ్ అధికారు లు పట్టుకున్నారు. ఐదు రోజుల క్రితం అల్లిపురంలో 2,500 మత్తు ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు ఇంజక్షన్లకు అల్లిపురం కేంద్రంగా మారుతోంది. స్మగ్లర్స్ విశాఖ యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న గాజువాక పరిధిలోని దువ్వాడ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో షాపు యజమాని మహేశ్వరరెడ్డి దగ్గర 35 మత్తు ఇంజక్షన్లు, నీడిల్స్, గంజాయి, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కత్తాకు చెందిన ఓ విద్యార్థి 50 ఇంజక్షన్ల బాక్సు ను రూ. 2 వేలకు ఇస్తున్నట్లు తేలింది. అయితే మెడికల్ షాపు యజమాని రూ. 10 వేలకుపైగా అమ్ముతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. విశాఖ నగరం లోని అల్లిపురంలో కొందరు ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
One Tv News