One Tv News - NEWS / కర్నూలు జిల్లా : మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారితోపాటు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం 11 సంవత్సరాల బాలిక పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిని సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితురాలిని పరామర్శించారు. భాదిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర, రాము, శ్రీధర్, కోడుమూరు రాముడు ఉప్పర సంఘం నాయకులు పాల్గొన్నారు.
One Tv News