Tuesday, 24 February 2026 03:05:30 PM

రేషన్ డీలర్ ఆందోళన కార్యక్రమం

సిరిసిల్ల

Date : 16 May 2023 05:57 PM Views : 128

One Tv News - NEWS / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాసిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.తమ న్యాయ మయిన డిమాండ్ లు నెరవేర్చాలని,జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ,,ప్రతి రేషన్ డీలర్ కు 30 వేల గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.

గత మూడు నెలలుగా విడుదల కానీ కమిషన్ ను వెంటనే విడుదల చేసి ,ప్రతి రేషన్ షాప్ ను మినీ సూపర్ మార్కెట్ గా మార్చి నిత్యవసర సరుకులు అందుబాటు లోకి తేవాలన్నారు.ప్రతి గన్ని బ్యాగ్ కు 30 రూపాయలు పెంచాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం చేయక పోతే దుకాణాలు మూసివేసి రానున్న రోజుల్లో సమ్మె ను మరింత ఉదృతం చేస్తానన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :