Wednesday, 15 April 2026 04:31:40 PM

ఆలమూరు మండలం జొన్నాడ హిజ్రా హత్య

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా

Date : 14 May 2023 04:36 PM Views : 345

One Tv News - NEWS / తూర్పు గోదావరి జిల్లా : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ 216వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో పంట కాలువ వంతెన వద్ద హిజ్రాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పంట కాలువలో పడవేశారు. వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా మాధవరం మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మరిపట్ల ఆనంద్ (33) (హిజ్రా)ను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో తీవ్రంగా గాయపరిచి హత్యచేసి పంట కాలువలో పడవేశారు. ఈ మేరకు శనివారం కొత్తపేట డిఎస్పి కే వెంకటరమణ, రావులపాలెం సర్కిల్ సీఐ రజిని కుమార్, ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్, రావులపాలెం ఎస్సై వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. వేలిముద్ర నిపుణులను, డాగ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించి మరిన్ని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్థానిక ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.

వేలిముద్ర నిపుణులను, డాగ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించి మరిన్ని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్థానిక ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :