One Tv News - NEWS / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా 353 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే గణపురం మండలం చెల్పూర్ కేటీపీపి సమీపంలో ఉదయం 11 గంటలకు బైక్ ను టిప్పర్ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వీరయ్యపల్లి గ్రామానికి చెందిన మొగులోజు సత్యం (37) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సత్యం చెల్పూర్ డీఏవీ పాఠశాలలలో స్కూల్ బస్ క్లీనర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ పై స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
One Tv News