One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా బద్వేల్ బి.ఆర్ అంబేద్కర్ మిషన్, అధ్యక్షులు నుసిమి గౌస్ పీర్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ఎన్ఫోర్మేంట్ కమిటీ చైర్మన్ యు మునయ్య , ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ బద్వేల్ డివిజన్ కమిటీ నెంబర్ సి నారాయణ గోప వరం మండలంలోని పి పి కుంట గ్రామం ఎస్టీ కాలనీ ని విజిట్ చేశారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మిషన్ అధ్యక్షుడు నుసిమి గౌస్ పీర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి పిపి కుంట గ్రామంలో నివసిస్తున్న ఎరుకల గిరిజన కుటుంబాల కి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు కనీసం వాళ్లు నివసించుటకు ఇల్లు నీరు కరెంటు రోడ్లు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక చీకటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అన్నారు నారాయణ మాట్లాడుతూ ఎరుకల గిరిజనులు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా జీవనం సాగించడం చాలా బాధాకరం తక్షణమే వారి సమస్యలపై ప్రభుత్వ అధికారులు స్పందించి అక్కడ ఉన్న ఎరుకల గిరిజనుల వారికి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్నికి విన్నవించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మిషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు
One Tv News