One Tv News - NEWS / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో వీఆర్ఏల సంఘం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తూ స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు
ఈకార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు హన్మంతు, ఉపాధ్యక్షులు భూమయ్య, జనార్దన్ రెడ్డి, మంజుల,సుమలత,సకుబాయి, వీరేశం, నాగమణి,అశోక్, అనంతు, హన్మంతురావు, అంబయ్య, సంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
One Tv News