One Tv News - NEWS / విజయనగరం జిల్లా : కాపుల ముద్దుబిడ్డ,కాపు జాతి మేలిమి బంగారం వంగవీటి మోహనరంగా ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తామని విజయనగరం జిల్లా తెలగ కుల యువజన సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. వంగవీటి మోహనరంగా జయంతోత్సవం సందర్భంగా నగరంలో తెలగ యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా విజయనగరం కోట జంక్షన్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వంగవీటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ వంగవీటి మోహనరంగా, జై తెలగజాతి నినాదాలతో హోరెత్తించారు. పూర్తి రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ భారీ బైక్ ర్యాలీలో సుమారు ఐదు వందల మంది యువత పాల్గొని నగరంలోని కోట, మూడు లాంతర్లు, గంటస్థంబం, కన్యకపరమేశ్వరి ఆలయ కూడలి, ఎన్సీఎస్, రైల్వేస్టేషన్, మయూరి కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడ మీదుగా మళ్లీ కోట కూడలికి చేరుకుంది.
వంగవీటి జయంతిని పురస్కరించుకొని కోట కూడలి వద్ద తెలగ యువత ఆధ్వర్యంలో భారీగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాటాడుతూ కాపు కుల బలోపేతానికి వంగవీటి వెలకట్టలేని తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తెలగ కులస్తులంతా వంగవీటి ఆశయాల మేరకు ఒకే త్రాటిపైకి రావడం ఆనందంగా ఉందని, ఇదే స్పూర్తితో భవిష్యత్తులో కులాన్ని మరింత బలోపేతం చేయడమే గాక, సేవా కార్యక్రమాలు చేపట్టేలా వేదికను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
One Tv News