One Tv News - NEWS / పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి తో అందర్నీ ఇబ్బంది పెడుతున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ ప్రజా చైతన్య పాదయాత్ర కు 100 రోజు సందర్భంగా భీమవరంలో ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో విజయ కేతన ర్యాలీ నిర్వహించినట్లు టిడిపి సీనియర్ నాయకులు గంటా త్రిమూర్తులు, మద్దుల రాములు తెలిపారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం వీరమ్మ పార్క్ వద్ద నుండి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సైకో పోవాలి. సైకిల్ రావాలి అంటూ నినాదాలతో ఆదివారం బజార్ , ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్, అడ్డ వంతెన అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు మండు వేసవిలో ఎండను కూడా లెక్కచేయకుండా కాలినడకన ఆనందోత్సవాలతో ర్యాలీ నిర్వహించారు. .
ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నాయకులు నేదునూరి బాలగంగాధర్, ఐజక్ బాబు, నీలాతీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
One Tv News