One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా బద్వేల్ పట్టణం శ్రీ బిజివేముల వీరారెడ్డి ఆడిటోరియంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి హాజరై మిషన్ రాయలసీమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాయలసీమ యువత ఉజ్వల భవిష్యత్తు కోసం మిషన్ రాయలసీమ డిక్లరేషన్ పొందుపరిచారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రానున్న ఐదు సంవత్సరాలలో రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి కర్నూల్ అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని, ఎలక్ట్రానిక్ తయారీ హబ్ గా ఉమ్మడి చిత్తూరు జిల్లాను మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ పరిశ్రమలను ఇక్కడికి తీసుకొస్తామని, అనంతపూర్ జిల్లాను ఆటోమొబైల్ హబ్బుగా తీర్చి దిద్దుతామని తెలిపారు.
అన్నదాతకు ఆదాయం రెండింతలు అయ్యేలా ప్రణాళికలు తయారవుతున్నాయని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయాన్నిఅందించాలని కోరారు.
One Tv News