Tuesday, 21 April 2026 02:53:24 PM

వృద్ధురాలి ఇంట్లో జరిగిన చోరీ కేసును కూచిపూడి పోలీసులు చేదించారు

కోసూరు

Date : 19 May 2023 04:28 PM Views : 174

One Tv News - NEWS / కృష్ణా జిల్లా : కృష్ణాజిల్లా మొవ్వమండలం కోసూరులో వృద్ధురాలి ఇంట్లో జరిగిన చోరీ కేసును కూచిపూడి పోలీసులు చేదించారు. చోరీకి పాల్పడిన కే.అంకాలరావు అనే వ్యక్తితో పాటుగా, బాల నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిల వద్ద స్వాధీనం చేసుకున్న సొత్తును గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్ మీడియాకు చూపించారు.

కోసూరులో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు బేబీ సరోజినీను బెదిరించి జరిగిన దోపిడీని చాలెంజ్ గా తీసుకుని కేసులు చేదించామని డిఎస్పి తెలిపారు. ముద్దాయిలు వద్ద నాలుగు లక్షల విలువ చేసే తొమ్మిది కాసుల బంగారం ఆభరణాలు, మోటార్ బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించి కేసులు చేదించిన సీఐ వెంకటనారాయణ బృందానికి డీఎస్పీ పి.శ్రీకాంత్ రివార్డులను అందజేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :