One Tv News - NEWS / విజయనగరం జిల్లా : విజయనగరం జిల్లా లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఎస్.కోట...టీడీపీ నేత కోళ్ల లలిత కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు విజయనగరం లో అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ 18వ తేదీ సాయంత్రం జిల్లా లోని ఎస్.కోటలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు "ఇదేం ఖర్మ " ద్వారా బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.
ఆ మర్నాడు 19వ తేదీన...బీసీ నేతలతో సమావేశం ఉంటుందని లలిత కుమారి తెలిపారు. జిల్లా లో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆదేశాలతో...ఆయన ఆద్వర్యంలో పార్టీ ముందు కెళుతోందని..లలిత కుమారి తెలిపారు ఈ రెండు రోజుల బాబు పర్యటన ను పార్టీ నేతలంతా దిగ్విజయంగా నిర్వహించాలని...అలాగే ప్రజలు "ఇదేం ఖర్మ" కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు..
One Tv News