Wednesday, 15 April 2026 04:29:01 PM

కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు శైలజనాథ్

అనంతపురం

Date : 13 May 2023 06:49 PM Views : 380

One Tv News - NEWS / ఏలూరు జిల్లా : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆంధ్రాలోని అనంతపురం జిల్లా కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు శైలజనాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.... రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజలు, ప్రజాస్వామ్యం విజయం సాధించిందని అన్నారు. నియంతృత్వ బిజెపికి ఇది ఒక చంప పెట్టు లాంటిదని హెచ్చరించారు. దేవుని, మతాన్ని రాజకీయాలకు వాడుకున్నందుకుగాను బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పారని, ఇకనైనా బిజెపి కుల, మతాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయకూడదని సూచించారు.

రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శైలజనాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :