Tuesday, 21 April 2026 02:44:59 PM

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూలర్‌

మంథని

Date : 15 May 2023 07:19 PM Views : 173

One Tv News - NEWS / పెద్దపల్లి జిల్లా : ఎండ తీవ్రతతో ఆస్పత్రిలో కాన్పు అయిన పేదింటి బిడ్డలు అవస్థలు పడుతుంటే మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకోలేదని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథనిలోని మాతా శిశు ఆస్పత్రిలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూలర్‌లను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ ఘనంగా ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.... మాతా శిశు ఆస్పత్రిలో ఈనాడు కాన్పు కోసం వచ్చిన వారిలో ఐదుగురు బీసీ, నలుగురు ఎస్సీ, ఒకరు మైనార్టీ బిడ్డలే ఉన్నారని అన్నారు.

ఈ ఆస్పత్రిని ఎక్కువగా అట్టడుగు వర్గాలే ఉపయోగించుకున్నారని తెలిపారు. అయితే అట్టడుగు వర్గాలకు సేవలు అందించే ఆస్పత్రికి ఎమ్మెల్యేకు పట్టింపులేకుండాపోయిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆకలి తెలియని వాళ్లకు అధికారం ఇవ్వబట్టే ఇన్నిఇబ్బందులు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :