Sunday, 19 April 2026 07:03:36 PM

మేనిఫెస్టో పేరుతో మరోమారు మహిళలను మోసం -కార్పొరేషన్ చైర్పర్సన్ గానుపెంట రవణమ్మ

బద్వేల్

Date : 30 May 2023 07:57 AM Views : 179

One Tv News - NEWS / కడప జిల్లా : మహిళలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కొరకు ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకానికి సంపూర్ణ స్థాయిలో న్యాయం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేదని, ప్రస్తుతం తెలుగుదేశం మేనిఫెస్టోలో మరో మారు మహిళల అభ్యున్నతి కొరకు పాటుబడతామని పేర్కొంటూ, మోసపూరితమైన వాగ్దానాలు ఇస్తున్నారని, రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్పర్సన్ గానుపెంట రవణమ్మ పేర్కొన్నారు. సోమవారం గానుగపెంట రమణమ్మ ,ఆమె భర్త వైసిపి నాయకులు గిద్దలూరు వైసిపి నియోజకవర్గ పరిశీలకులు గానుగపెంట శ్రీనివాసులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు డ్వాక్రా రుణాలు రద్దు పరుస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని నెరవేర్చకుండా మహిళలకు అప్పట్లో మోసం చేయడం జరిగిందన్నారు. అలాగే అక్కాచెల్లెళ్లకు పసుపు కుంకుమ పేరుతో ఎన్నికల చివరి క్షణంలో 10 వేల రూపాయలు పసుపు కుంకానికి ఇచ్చారని, అయితే పసుపు తెలుగుదేశం పార్టీకి అంటగట్టారని, కుంకాన్ని విజయసంకేతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలు ఆదరించాలని పేర్కొన్నారు.

అలాంటి నాయకుడు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు అమలుపరచలేని హామీలను ప్రకటించడం ఎంత మాత్రం సమంజసం అని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు గానుగపెంట శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని, నేడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని, ప్రజలందరికీ నేరుగా తమ ఖాతాలలో నిధులు ఏర్పాటు చేస్తున్నారని, అలాంటి నాయకుడిని కాదని తెలుగుదేశం పార్టీని ఆదరించే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :