Tuesday, 21 April 2026 02:59:52 PM

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం

మడకశిర

Date : 26 June 2023 07:57 PM Views : 246

One Tv News - NEWS / శ్రీసత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, మడకశిర పోలీసులు కలసి అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీగా వెళ్లి పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. రాజీవ్ గాంధీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాల నిర్మూలకై కృషి చేస్తామని ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు సెబ్ స్టేషన్ సిఐ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తూ జీవితం నాశనం చేసుకుంటున్నారని దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే మా సహాయ సహకారాలు అందించి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా యువత విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకోకూడదని తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :