Tuesday, 21 April 2026 07:15:05 PM

ఏపీఎస్ఆర్టీసీ విశాఖ దర్శిని పేరిట యాత్ర బస్సులు

భీమవరం

Date : 17 May 2023 08:03 PM Views : 177

One Tv News - NEWS / పశ్చిమ గోదావరి జిల్లా : వేసవికాలంలో విద్యార్థుల సెలవుల్లో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో ఏపీఎస్ఆర్టీసీ విశాఖ దర్శిని పేరిట యాత్ర బస్సులు ప్రారంభిస్తున్నామని భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం లో ఆర్టీసీ డిపో ప్రాంతీయ కార్యాలయంలో విలేకరులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ముఖ్యమైన ప్రదేశాలు సింహాచలం కైలాసగిరి జూ పార్క్ ఉడాఫర్క్.నేవి మ్యూజియం, సబ్ మెరైన్, ఆర్కే బీచ్ కాళీ టెంపుల్ సందర్శనార్థం ప్రతి శనివారం రాత్రి 7 గం కు బయలుదేరి సోమవారం ఉదయం భీమవరం బస్టాండుకు చేరుకుంటుందని ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులు పెద్దలకు 1150/ రూ, చిన్నారులకు 1100/ రూ అల్ట్రా డీలక్స్ 1100/ అని చిన్నపిల్లలకు 850/ రూ అతి తక్కువ ధరలు ప్రయాణిక దేవుళ్లకు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో విహారయాత్రలు లో ప్రతి శనివారం ఏడు గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం భీమవరం చేరుకుంటుందని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :