One Tv News - NEWS / నంద్యాల జిల్లా : కర్నూల్ నంద్యాల జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు నంద్యాల జిల్లాల పోలీస్ అధికారుల తో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని ముఖ్యంగా హత్యలు హత్యాయత్నాలు తగ్గాయని తెలిపారు. నేర ప్రవృత్తి కలిగిన వారిని నియంత్రించడం ద్వారా నేరాల సంఖ్య తగ్గించడంలో సఫలీకృతమయ్యామన్నారు. మహిళా పోలీసుల సేవల్ని బాగా వినియోగించుకొని మహిళలపై అత్యాచారాల్ని అఘాత్యాల్ని అదుపు చేశామని, అలాగే బాల్య వివాహాలు కూడా తగ్గాయి అన్నారు. దొంగతనాలు, హౌస్ బ్రేకింగ్ ల సంఖ్య కూడా ఘనంగా తగ్గిందని ప్రమాదాల నివారించడంలో కూడా తమ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనపరిచిందన్నారు. శాంతిభద్రతలపై కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆరోపణలు చేసే వారికి తమ వద్ద ఉన్న గణాంకాలతో కూడిన ఆధారాలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉత్తమ సేవలందించిన గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ప్రశంస పత్రాలతో పాటు నగదు పురస్కారాలు డిజిపి అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డి ఐ జి చింతల్ కుమార్, కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, సబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ లు పాల్గొని నేర నియంత్రణకు తీసుకోవాల్సిన విషయాలపై డీఎస్పీలకు, సీఐలకు, ఎస్ఐలకు దిశా నిర్దేశం చేశారు.
One Tv News