One Tv News - NEWS / మెదక్ జిల్లా : రహాదారులనిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ చాంబర్ లో జిల్లా రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మెదక్, నరసాపూర్, అందోల్, నారాయణఖేడ్, దుబ్బాక, గజ్వెల్ నియోజక వర్గాలలో 2021-22 సంవత్సరంలో 16 కోట్ల 20 లక్షల వ్యయంతో చేపట్టిన 46. 39 కిలో మీటర్ల బి.టి. రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి 9 పనులు, 2022-23 లో 49 కోట్ల వ్యయంతో 86 కిలో మీటర్ల మేర బి.టి. రోడ్ల పునరుద్దరణకు సంబంధించి 13 పనులకు గాను 3 పనులు ప్రగతిలో ఉండగా మిగతా పనులు టెండర్ దశలో ఉన్నాయని అన్నారు.
స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద గిరిజన తండాలలో బి.టి. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పధకం క్రింద మెదక్ నియోజక వర్గంలో 43 కోట్ల 77 లక్షల వ్యవయంతో 42 .55 కిలో మీటర్ల రహాదారి నిర్మాణానికి 26 పనులు, నరసాపూర్ నియోజక వర్గంలో 64 కోట్ల 17 లక్షల వ్యవయంతో 81 . 21 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి 30 పనులు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల వ్యయంతో 3 కిలో మీటర్ల రహాదారి నిర్మాణానికి 2 పనులకు వెంటనే టెండర్లు ఆహ్వానించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి డిప్యూటీ ఎస్.ఈ. ఆర్.సి.పర్స్, డిప్యూటీ ఈ ఈ వెంకటేశం, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
One Tv News