One Tv News - NEWS / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమానంగా పోరాటం చేశానని బిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను ఈనెల 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తెలంగాణ ఉద్యమకారుడునని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను ప్రత్యేక భూమిక పోషించానని అన్నారు .
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను ఉద్యమం నుండి వచ్చానని తనకు స్థానికుడు స్థానికేతరుడనే సమస్య ఉండదని తాను ఎక్కడినుండి అయినా పోటీ చేయవచ్చునని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తాను పోటీ చేస్తే విజయం ఖాయమని అన్నారు. అధిష్టానం తప్పక నిర్ణయం తీసుకుంటుందని త్వరలో తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పర్యటిస్తానని అన్నారు.
One Tv News