One Tv News - NEWS / నంద్యాల జిల్లా : ఆరోగ్యమే మహాభాగ్యము అన్న నానుడిని అనుసరించి ప్రతి ఒక్కరూ.. మంచి ఆరోగ్యం కోసం క్రీడలకు,వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలని ఆళ్లగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాయబ్ రసూల్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శిల్పా నేచర్ హోమ్స్ ఆవరణలో ఆదివారం " జోష్ -ఆళ్లగడ్డ" ఏరోబిక్స్ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రస్తుతం అందరూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.
రోటరీ ఆరోగ్య వేదికను స్థాపించి ఆరోగ్య ఆళ్లగడ్డగా యువతను ప్రోత్సహిస్తు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి చేస్తున్న కృషిని వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ అభినందించారు. డాక్టర్ రాంగోపాల్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్ పాల్గొని ఏరోబిక్స్, క్లాఫింగ్ థెరపీ శిక్షణ ఇచ్చారు.
One Tv News