One Tv News - NEWS / చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నెల రోజులుగా టమోటా ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కూలి, రవాణా ఖర్చులూ రాకపోవడంతో పొలాల్లోనే కాయలు వదిలేశారు. దీంతో టమోటా కాయలు ఎర్రగా మాగి ఓ వైపు కుళ్లి పోతుంటే, మరికొందరు రైతులు టమోటా కోయకుండానే మొక్కలను వేర్లతో సహా తీసేస్తున్నారు. రామకుప్పం మండలానికి చెందిన రామమూర్తి అనే రైతు ఒకటిన్న ఎకరా టమోటా సాగు చేశాడు. ఖర్చు ఒక లక్షా ఇరవై వేలు వచ్చిందని, కాయలు కోయడానికి మండీ వద్దకు వెలితే కనీసం బాక్సులు కూడా ఇవ్వడం లేదన్నాడు. దీంతో చేసేది లేక టమోటా మొక్కలను వేర్లతో సహా తీసేశాడు. .
తీవ్రంగా నష్టపోయిన టమోటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు
One Tv News