Tuesday, 21 April 2026 03:38:07 PM

వడ్లు కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

కాటారం

Date : 20 May 2023 08:05 PM Views : 181

One Tv News - NEWS / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

పోయిన నెల లో వరి పొలాలు కోసి దాన్యం తీసుకొచ్చి పోసామని ఇప్పటికి మూడుసార్లు వర్షాలు వచ్చాయని అయినా వడ్లు కొనుగోలు చేయడం లేదని గత సంవత్సరం కొనుగోలు చేసిన వరి ధాన్యం డబ్బులు కూడా సుమారు 20 మంది రైతులకు ఇంకా రాలేదని తీసుకున్న అప్పులు పెరిగిపోయి వడ్డీలు సైతం కట్టలేని పరిస్థితి ఉందని ఆ డబ్బులను త్వరగా చెల్లించి అదే విధంగా వరి ధాన్యం త్వరగా కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :