Tuesday, 21 April 2026 02:53:18 PM

పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి

సిద్దిపేట జిల్లా

Date : 14 May 2023 10:09 AM Views : 157

One Tv News - NEWS / సూర్యాపేట జిల్లా : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జగదేవపూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కెసిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన 136 సీట్లు గెలుచుకోవడంతో అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనకు కర్ణాటక ఎన్నికలు నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమం లో మాజీ పి ఎస్ సి ఎస్ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మాజీ కొండ పోచమ్మ చైర్మన్ మల్లేశం, కొత్త శ్రీనివాస్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీలు మహేష్ మహేందర్ రెడ్డి , సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి అమర రాము,ఎండి అజిత్ రషీద్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :