One Tv News - NEWS / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని జూలై ఆరో తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టిన నేపథ్యంలో, 13వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ..... కొత్తగూడెం నియోజకవర్గం లోని సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి ,చుంచుపల్లి, పాల్వంచ మండలాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి, ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తున్న పంచాయతీ కార్మికులను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంట్లోకి ఆహ్వానించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారని, మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి జిల్లా పంచాయతీ అధికారితో ఫోన్లో మాట్లాడారని, మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు దృష్టికి పంచాయతీ కార్మికుల సమస్యలను తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
One Tv News