Tuesday, 21 April 2026 02:47:28 PM

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం

భీమవరం

Date : 04 June 2023 08:01 AM Views : 195

One Tv News - NEWS / పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం పట్టణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పట్టణంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.భీమవరం సంజీవయ్య నగర్ లో ఒక కోటి 20 వేల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన పలు సిసి రోడ్ను ప్రారంభించారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అనంతరం 31.5 లక్షలు రూపాయలతో నిర్మాణం తలపెట్టిన సిసి రోడ్ను శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి వస్తే ఒకపక్క అభివృద్ధి, మరో ప్రక్క సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేస్తున్నామని, ప్రజల కోరిక మేరకు, వారి సూచనల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అభివృద్ధి పథంలో భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రస్థాయిలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తున్నానని, ఇందుకు ప్రజలు ఆంధ్ర సహకరిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :