One Tv News - NEWS / విజయనగరం జిల్లా : తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు జన్మదిన వేడుకలు సోమవారం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో కార్యకర్తలు, అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం శ్రీ సిద్ధివినాయకుని కోవెలకు మరియు శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెలకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి దర్శించుకోవడం జరిగింది. అనంతరం అశోక్ బంగ్లాలో చెవిటి మూగ పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్బంగా పేర్లవారి వీధిలో గల డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులను ఒక సంవత్సరం పాటు దత్తత నిమిత్తం శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులు మరియు పార్టీ నాయకులు అందరు కలిసి రూ. 2,23,000/- లు విరాళం అందించారు.మరియు పట్టణంలో గల నైట్ షెల్టర్ లో మోటారు రిపేరు చేయు నిమిత్తం జనసేన పార్టీ నాయకుడు శ్రీ గురాన అయ్యలు రూ. 24,500/- లు విరాళం అందచేశారు.
One Tv News