Sunday, 19 April 2026 07:03:36 PM

నూతన డిఎస్పీ కార్యాలయం ప్రారంభం

ఎమ్మిగనూరు

Date : 18 May 2023 04:25 PM Views : 179

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో భాగంగా ఆదోని రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేసిన డియస్పీ కార్యాలయాన్ని జిల్లా యస్పీ కృష్ణ కాంత్ చేతులు మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, బిఆర్ బసిరెడ్డిలు పాల్గొన్నారు. ఈమెరకు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాల విభజన అనంతరం ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతన కార్యాల ఆవరణంలో ఎస్పీ చెట్టు నాటారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పి ప్రసాద్, సిఐలు మధుసూదన్ రావు, ఎస్సైలు మస్తాన్వలి, శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, టౌన్ బ్యాంకు చైర్మన్ కొమ్మురాజు, తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :