One Tv News - NEWS / జగిత్యాల జిల్లా : ముదిరాజ్ కులస్తుల్లో ఉన్న అనైక్యతతోనే అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నామని వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముదిరాజులు ఏకం కావాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పులి నర్సయ్య ముదిరాజ్ పిలుపునిచ్చారు శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో పులి నర్సయ్య మాట్లాడారు. తెలంగాణ ఫిషరీష్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిట్టల రవీందర్ ను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు ఉన్న అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో ఒక లక్ష్య పదివేల మంది ముదిరాజ్ కులస్తులు ఉన్నారన్నారు. జగిత్యాల నియోజకవర్గములో 24 వేల మంది ఉన్నా అభివృద్ధి ఫలాలు చేరడం లేదన్నారు. ఇందుకు మనలో ఐక్యత లోపంతోనే ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోవడంలేదన్నారు. గ్రామస్థాయిలో మన కుల సంఘాలు ఉన్నాయని అయినా పాలకులకు మన కులస్తులపై దృష్టి సారించలేకపోయారన్నారు. ముదిరాజ్ కులస్తుల్లో ఐక్యత కోసం నిరంతర ప్రకీయను చేపట్టనున్నామని నర్సయ్య తెలిపారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం, ఐక్యత కోసం తమ పోరాటం ఆగదని అన్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముదిరాజులు ఏకం కావాలని పులి నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైలు ప్రమాదంలో మృతి చెందిన 250 మందికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మెఫా క్యాలండర్ ను, డైరీని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఉత్తమ్ మహేష్, మేపా జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ నర్సయ్య, పట్టణ అద్యక్షులు శ్రీనివాస్, గండి రమేష్, నెల్లి చందు, మల్యాల మండల అద్యక్షులు దొంతరవేని శేఖర్, పెద్ద గంగారాం, రవీందర్, పులి మహేష్, నర్సయ్య తోపాటు పలువురు ఉన్నారు.
One Tv News