One Tv News - NEWS / ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పనులను నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమను సురేష్ మంగళవారం పరిశీలించారు. శ్రీశైలంలోనీ కృష్ణా నదిలోనీ కొల్లం వాగు నుండి వెలుగొండ మొదటి టన్నెల్ సొరంగంలో మంత్రులు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు చాలా ప్రతిష్టత్మకమైన ప్రాజెక్టు అని ప్రాజెక్టు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించామని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నల్లమల్ల సాగర్ లో నీళ్లు నింపాలనే తాపత్రయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిగా ఉన్నారని తెలిపారు
నాలుగు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.. ఈ కార్యక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు...
One Tv News