One Tv News - NEWS / తూర్పు గోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని కొన్ని టెక్నికల్ ఇష్యుల వల్ల ఒకటి నుంచి రెండు శాతం మందికి లబ్ధి చేకూరలేదని వారికి కూడా లబ్ధి చేకూర్చాలని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ..
ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం నుండి లబ్ధి పొందాలని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు.
One Tv News