One Tv News - NEWS / అంబేద్కర్ కోనసీమ జిల్లా : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గపరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి బుధవారం ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో పర్యటించారు.ముందుగా గ్రామంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించి వారి నుండి ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుండి నాలుగు సంవత్సరాల కాలంలో చింతలూరు గ్రామంలో బీసీ లబ్ధిదారులకు 6 కోట్ల 21 లక్షల 64 వేల 378 రూపాయలు, ఎస్సి లబ్ధిదారులకు 3 కోట్ల 74 లక్షల 31 వేల 720 రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 9 లక్షల 45 వేల 922 రూపాయలు, మైనారిటీ లబ్ధిదారులకు 60 లక్షల 30 వేల 248 రూపాయలు, కాపు లబ్ధిదారులకు 57 లక్షల 90 వేల 85 రూపాయలు, ఇతర వర్గాల లబ్ధిదారులకు 3 కోట్ల 18 లక్షల 38 వేల 687 రూపాయలు వెరసి మొత్తం 14 కోట్ల 42 లక్షల 40 రూపాయలు వివిధ సంక్షేమ పథకాల రూపంలో లబ్ది చేకూర్చడం జరిగిందని తెలిపారు.
One Tv News