Tuesday, 21 April 2026 11:14:06 PM

కోసిగి మండలంలో రైతులు వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళన

కోసిగి

Date : 03 July 2023 10:18 AM Views : 171

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి వర్షాలను నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతులకు వరుణుడు కరుణించక పోవడంతో పంటలకు తెగుళ్లు సోకడంతో పంటలను పశువులకు మేతగా వదిలేయడంతో పాటు ట్రాక్టర్లతో దునేస్తున్నారు. కోసిగి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు రైతులు తమ పంటలను దున్నేశారు.

కోసిగి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు 6 ఎకరాలలో పత్తి పంటను సాగు చేసాడు. అయితే పంటకు తెగుళ్లు సోకడంతో పంటను ట్రాక్టర్ తో దున్నేశాడు.... అదే గ్రామానికి చెందిన మరో రైతు అంపయ్య వర్షాలు లేకపోవడంతో ఆముదం పంటకు పచ్చ తెగుళ్ళు సోకడంతో ట్రాక్టర్ తో దున్నేశాడు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :