One Tv News - NEWS / కర్నూలు జిల్లా : సమాజంలో నిర్భాగ్యులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర సంస్థల అధినేత షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. కర్నూల్ నగరంలోని పసుపల గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న అందుల పాఠశాలలో విద్యార్థుల నడుమ మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర అధినేత వివాహ వార్షికోత్సవం సందర్భంగా సిబ్బంది ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఆందుల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా అందుల పాఠశాల వార్డెన్ సుధాకర్ మాట్లాడుతూ... ఆంధ్రుల విద్యార్థుల నడుమ తెలుగు టీవీ ఆంధ్ర అక్షర అధినేత షేక్ మహబూబ్ బాషా వివాహ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం కలిగింది.
ఆదుల పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేవని అన్నారు. నిర్భాగ్యుల పట్ల మానవత్వం స్పందించి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.
One Tv News