One Tv News - NEWS / కర్నూలు జిల్లా : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకొని పోవడంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ పాత్ర ఎంతో ఉందని వి.ఓ.ఏ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బసవరాజు కర్నూలులో అన్నారు. కర్నూలు లోని దేవి ఫంక్షన్ హాల్ లో కర్నూలు మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలుకు చెందిన విలేజ్ అసిస్టెంట్ లు పాల్గొని వారి సమస్యలను జిల్లా అధ్యక్షులు దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బసవరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10వేల రూపాయులు వేతనం ఇస్తున్నప్పటి నుంచి రాజకీయంగా ఉద్యోగపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వం వెంటనే విఓఏల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వివోఏ లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టచ్ మొబైల్స్ ఇవ్వాలని కోరారు.
One Tv News