One Tv News - NEWS / అనంతపురం జిల్లా : పవన్ కళ్యాణ్ వాలంటీర్లను అవమాన పరచెల వ్యాఖ్యలు చేశాడంటూ కళ్యాణదుర్గం లో వైసిపి నాయకులు వాలంటీర్లను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. దీనికి నిరసనగా జనసైనికులు పట్టణ టీ కూడలిలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి వెళుతుండగా 30 యాక్ట్ అమల్లో ఉందంటూ పోలీసులు జన సైనికులను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
జనసేన నాయకులు మాట్లాడుతూ.. కళ్యాణదుర్గంలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినప్పుడు పోలీసులకు 30 యాక్ట్ గుర్తుకు రాలేదా అంటూ మండిపడ్డారు. వారాహి యాత్రతో వైసిపి అరాచక పాలనను ఎండ కడుతున్న పవన్ కళ్యాణ్ అంటే వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యమన్నారు.
One Tv News