Sunday, 19 April 2026 04:00:54 PM

రిలే నిరాహార దీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా

Date : 13 May 2023 08:51 PM Views : 145

One Tv News - NEWS / మేడ్చల్ /దమ్మాయిగూడ : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ కలెక్టరేట్ వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిభిరాన్ని ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలను ఆయనకు వివరించగా సానుకూలముగా విన్నారు. ఈ సందర్భముగా కోదండరాం తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.... సీనియర్, జూనియర్ సెక్రెటరీలకు ఒకటే జీతం ఇవ్వాలని ఆయన కోరారు. జూనియర్ కార్యదర్శి సోనీ ఆత్మహత్య కు కారణం ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. అనాగరికంగా ప్రభుత్వం జూనియర్ కార్యదర్శుల పై ఒత్తిడి చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. మధ్యేమార్గంగా సమస్యలను పరిష్కరించాలని, వేంటనే వారిని క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వానికి ఆయన విన్నవించారు. జూనియర్ కార్యదర్శులు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారని, అలాంటి వారికి ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్రములో గ్రామ పంచాయతీలకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ వల్లే ఇన్ని అవార్డులు వచ్చినవని ఆయన గుర్తు చేశారు. మనకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారని, బాద పడవల్సిన అవసరం లేదని ఆయన వారికి భరోసానిచ్చారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :