Wednesday, 15 April 2026 04:36:39 PM

ఏసీ సమీపంలో ఎవరు లేకపోవటం తో ప్రమాదం

సత్తుపల్లి

Date : 04 June 2023 07:58 AM Views : 271

One Tv News - NEWS / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామ సమీపంలో అవని వెంచర్ లో ఓ ఇంట్లో ఏసీ దగ్ధమైంది.కిషోర్ అనే ప్రైవేట్ టీచర్ కు చెందిన వ్యక్తి ఇంట్లో హై ఓల్టేజ్ కారణంగా ఏసీ దగ్ధం అయింది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హై ఓల్టేజ్ కారణంగా ఏసీ దగ్ధం అయిందని ప్రమాద సమయం లో ఏసీ సమీపం లో ఎవరు లేకపోవటం తో ప్రమాదం తప్పిందని కిషోర్ తెలిపారు.

గత కొద్దరోజులుగా హై ఓల్టేజ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని,గృహోపకరణాలు పాడవుతున్నాయి అని గత రెండు నెలలుగా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవటం లేదని వారి నిర్లక్ష్యం కారణంగానే ఏసీ దగ్ధం అయిందని ఆరోపించారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :