Tuesday, 21 April 2026 02:45:45 PM

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం

కుప్పం

Date : 23 June 2023 05:34 PM Views : 184

One Tv News - NEWS / చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గుడుపల్లి మండలం లో రెండు రోజుల పాటు పల్లెబాట మొదటి రోజు బెగ్గిలిపల్లి గ్రామ పంచాయతీ నుండి ప్రారంభమైన పల్లెబాట అనంతరం శెట్టిపల్లి, పెద్దభజనవాడ, యమగానీపల్లి, కనమనపల్లి, కంచిబందార్లపల్లి, గుండ్ల సాగరం, ఆగరం లో ఉత్సాహంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మనం శ్రీ వైఎస్ జగన్ కు ఓటు వేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

కుప్పం లో భరత్ విజయం సాధిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సిఎం శ్రీ వైఎస్ జగన్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. 12 సంవత్సరాల ముందు ఈ గ్రామాలకు వచ్చాను మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు పై దృష్టి సారించాం అన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :