One Tv News - NEWS / నల్లగొండ జిల్లా : ఉచిత గుండె పరీక్షల క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి అని కామినేని మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. మే 17వ తేదీన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలోని కామినేని హాస్పిటల్ నందు గుండె పరీక్షలు ఉచితంగా చేయనున్నామని స్థానిక ప్రజలంతా క్యాంపులో పాల్గొని ఉచితంగా మెడికల్ పరీక్షలు అన్నీ చేయించుకొని ఆరోగ్యంగా జీవించాలని అన్నారు.
ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకు హార్ట్ ఎటాక్ తో ఆరోగ్యంగా ఉన్న యువకులు కూడా మరణిస్తున్నారు దానికి కారణం వారు ముందస్తుగా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోలేకపోవడమేనని అర్థమవుతుంది గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి చెకప్ చేయించుకునే పని లేకుండా మా ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి డాక్టర్లను తీసుకువచ్చి పేద ప్రజలకు ఉచితంగా గుండె పరీక్షలు చేస్తామని అన్నారు.
One Tv News