Saturday, 18 April 2026 03:41:13 AM

పెనుగొండ పార్టీ కార్యాలయం టీడీపీ మీడియా సమావేశం

పెనుగొండ

Date : 17 May 2023 07:47 PM Views : 176

One Tv News - NEWS / అనంతపురం జిల్లా : రైతు సమస్యలను వై సీపీ ప్రభు త్వం పూర్తిగా విస్మరించిందని టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి గంధం వెంకటరాజు పేర్కొన్నారు. రైతు సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో పెనుగొండ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... అకాల వర్షాల వలన రైతులు వద్ద నుంచి ధాన్యం సేకరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనన్నారు.స్థానిక మంత్రి ఆచంట శాసన సభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు రైతు సమస్యలను పట్టించుకోకుండా కేవలం పత్రికలో ప్రకటనలు కోసం మాత్రమే రోజుకి లక్ష గోనె సంచులు సొంత ఖర్చులతో అందిస్తున్నామని హామీ ఇచ్చి వారం రోజులు గడుస్తున్న ఆచంట నియోజకవర్గంలో ఇప్పటి వరకు గోనె సంచుల కొరత తీరలేదు.రైతు భరోసా కేంద్రాల నుంచి గానీ,రైస్ మిల్లర్లు అసోసియేషన్ ద్వారా గాని రైతుకి ఒక్క గోనె సంచి కూడా అందలేదు.స్థానికంగా గతంలో ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.ఎన్నికల ముందు చదువుకునే విద్యార్థులకు పెనుగొండ కాలేజీకి బస్సు సౌకర్యం ప్రారంభించి ఎన్నికల తరువాత రద్దు చేశారు.అలాగే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయిస్తామని ఇచ్చిన హామీల్లో భాగంగానే రైతులకు కూడా హామీ ఇచ్చారా అని అసలు రైతులకు న్యాయం జరిగేది ఉందా అని తమకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.టీడీపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎంతో కృషిచేసిన రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

గిట్టుబాటు ధర లేక, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందక రైతులు అవస్థలు పడుతున్నారని, రైతు ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం, రైతు భరోసా పేరుతో రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు. రైతులే వైసిపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారని తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :