Sunday, 19 April 2026 07:07:09 PM

కలెక్టర్ సృజన సమీక్ష సమావేశం

పత్తికొండ

Date : 17 May 2023 07:35 PM Views : 169

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విజ్ఞప్తి మేరకు పత్తికొండకు విచ్చేసి ఆర్డిఓ కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పంచాయతీ అధికారులతో చర్చించారు.

ఎమ్మెల్యే శ్రీదేవి, కలెక్టర్ సృజనతో కలిసి రహదారి వెంట తిరుగుతూ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను తెలియజేశారు. పత్తికొండ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు విస్తరణ కోసం ఎదురుచూస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. ప్రాథమిక స్థాయిలో ఆక్రమణలను తొలగించి, జూన్ మాసంలోగా ల్యాండ్ ఆక్విజేషన్ పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం పత్తికొండ ప్రభుత్వ హాస్పిటల్ ని పరిశీలించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :