One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 63అంశాలకు ఆమోదముద్ర వేశారు. సీపీఎస్ రద్దు చేసిన ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కమిటీ వేసింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్Gps బిల్లు-2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయనున్నారు. అదేవిధంగా దాదాపు 23 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల కలనేరవేరింది.వారి క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఎన్నికల ముంగిట్లో ప్రభుత్వ ఉద్యోగులు,కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వం పై ఎలాంటి అసమ్మతి లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.జగన్ పాదయాత్ర సమయంలో సీపీఎస్ రద్దు,ప్రవేట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు నాడు ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు వారు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు, విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతించింది.నర్సాపూర్ ఫిషరీస్ కు 140 కోట్ల రూపాయల మంజూరుకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు పలు కీలకనిర్ణయాలకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది.
One Tv News