One Tv News - NEWS / కడప జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి నిరుపేద కుటుంబంలో సంక్షేమ కాంతులు వెళ్లి విరుస్తున్నాయని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. శుక్రవారం కడప జిల్లా బి కోడూరు మండలం, ఐత్రం పేట పంచాయతీ పరిధిలోని అమ్మవారి పేటలో స్థానిక వైసిపి నేతలతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు ప్రతి గడపకు వెళ్లి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. ఆ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.. అనంతరం ప్రతి గడపకి వెళ్లి ఇప్పటివరకు వైసిపి ప్రభుత్వం ఆ కుటుంబాలకు ఎంత మేరకు లబ్ధి చేకూరింది, ఎన్ని సంక్షేమ పథకాలు వర్తించాయి అన్న విషయాలను వారికి కులం కుశంగా వివరించారు... వచ్చే ఎన్నికల్లో కూడా మీ అమూల్యమైన ఓటును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, వారు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, వైసిపి ముఖ్య నేతలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు
One Tv News