One Tv News - NEWS / హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీస్ కమీషనరేట్ ఘట్ కేసర్ లో అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ యత్నానికి పాల్పడిన నలుగురిని ఘట్ కేసర్ పోలీసులు అరెస్టు చేశారు .ఘట్ కేసర్ పీఎస్ లో నిందితులను మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి మీడియా ముందు హాజరు పరిచారుమేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ బుద్దానగర్ కి చెందిన అవినాష్ రెడ్డి దగ్గర పక్కింట్లో ఉండే ఆరోషికరెడ్డితో 2015 నుండి పరిచయం ఏర్పడిందిగతంలో అవినాష్ రెడ్డి నుండి ఇరవై అయిదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న ఆరోషికరెడ్డిఅందులో తొమ్మిది లక్షలు తిరిగి చెల్లించారుబ్యాలెన్స్ అమౌంట్ కోసం ఆరోషికరెడ్డి పై అవినాష్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడుతన భార్యపై వేధింపులు ఎక్కువ కావడంతో అవినాష్ రెడ్డి ని అంతం చేసేందుకు చక్రధర్ గౌడ్ నిర్ణయించుకున్నాడుపథకంలో భాగంగా ఆరోషికరెడ్డి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కోసం ఘట్ కేసర్ వందన హోటల్ కు రమ్మని చెప్పాడు.
వందన హోటల్ వద్ద అవినాష్ రెడ్డి ని కారులో ఎక్కించుకుని చక్రధర్ గౌడ్ కిడ్నాప్ చేసే యత్నం చేయడంతోస్థానికులు అడ్డుకోవడంతో చక్రధర్ గౌడ్ అతని అనుచరులు పారిపోయారుబాధితుడు అవినాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , ఒక కారు , ఒక బైక్ , అయిదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు
One Tv News