Sunday, 19 April 2026 07:12:16 PM

దొంగ ఓట్లు చేర్చడానికి వైసీపీ కుట్రలు చేస్తోంది - బండారు సత్యానందరావు

కొత్తపేట

Date : 03 July 2023 09:33 AM Views : 166

One Tv News - NEWS / తూర్పు గోదావరి జిల్లా : ఓటమి భయంతోనే ప్రతిపక్షాల ఓట్లు తొలగింపు, దొంగ ఓట్లు చేర్చడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు,కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు.రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలనలో ఘోరంగా విఫలమైన వైయస్సార్ ప్రభుత్వం, రానున్న ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడి విజయం సాధించాలని కుట్రలకు తెరతీస్తుంది అన్నారు ముఖ్యంగా ఓటర్ లిస్ట్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను వలంటీర్ ద్వారా గుర్తించి, వారు ఓట్లు తొలగించడానికి ఒక పక్క ప్రయత్నం చేస్తూ మరొక పక్క తమ పార్టీకి సంబంధించిన ఇతర ప్రాంతాలు వారిని స్థానికంగా ఓటర్లుగా చేర్చడానికి ప్రయత్నిస్తోందన్నారు.కొత్తపేట నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ఇదే ప్రక్రియను స్థానిక వైసీపీ నేతలు కొనసాగిస్తూ ఉండడం మనం వరుస ఎన్నికల్లో చూస్తున్నాం. ఒక బూత్ లోని ఓటర్లను వేరు వేరు పోలింగ్ బూత్ లకు మార్చి వేయడం లేదా తొలగించే చర్యలు పట్ల టిడిపి బూత్ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలి. అన్నారు చేరికలు,తొలగింపులకు సంబంధించి బిఎల్వోలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, లేనిపక్షంలో వారిపై ఎన్నికల సంఘం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.. బిఎల్వోలు ఏకపక్షంగా వ్యవహరిస్తే వారి వ్యవహార శైలి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలకు పట్టుబడతాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుత్తుల పట్టాభి రామారావు, చిలువూరు సతీష్ రాజు, పడాల బులికొండరెడ్డి, కాసా సాగర్, సిద్దిరెడ్డి శ్రీనివాస్, శీలం ఆంజనేయులు, కోట వెంకటేశ్వరరావు, చప్పిడి ప్రసాద్,బొంతు రాంబాబు, కరుటూరి రంగరాజు, చిట్టూరు శ్రీను, సాధనాల బాబి తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :