One Tv News - NEWS / ఏలూరు జిల్లా : నూజివీడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'భవిష్యత్ గ్యారంటీ' కార్యక్రమంలో భాగంగాటిడిపి నాయకులు , కార్యకర్తలు బస్సుయాత్ర ప్రారంభించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు . ఆంజనేయస్వామి గుడి నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ , పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ , గాంధీనగర్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు . టిడిపి శ్రేణులు గాంధీనగర్ లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . . అనంతరం ప్రముఖులు స్పీచ్ ఇస్తున్న సమయంలో సందర్భంలో ఒక్కసారిగా స్టేజి కూలిపోయింది . టిడిపి నాయకులు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి . నూజివీడులోని వాణి నర్సింగ్ హోమ్ లో చికిత్స అందించారు. ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు కాలికి గాయమైనట్లు తెలుస్తోంది వెంటనే ఆయన కారులో ఆసుపత్రికి తరలించారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒక వ్యక్తికి గాయం కాగా కుట్లు వేశారు . మరో వ్యక్తి చేతికి స్వల్ప గాయమైనట్లు తెలిపారు . ఏలూరు జిల్లా పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ బలమైన ఈదురు గాలుల వల్ల నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టిడిపి బహిరంగ సభ స్టేజి కూలడం జరిగిందని దేవుడి దయవల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఒకరిద్దరికి తప్ప మిగతా వారంతా కూడా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
బహిరంగ సభకు వెళ్లే ముందు నూజివీడు పట్టణంలో గాంధీనగర్ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రభుత్వ చీఫ్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ యువనేత ఆధ్వర్యంలో ప్రజలకు మేలయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు .
One Tv News