One Tv News - NEWS / తూర్పు గోదావరి జిల్లా : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబంధించి జూలై 15వ తేదీ నాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లో గల మండపేట, కపిలేశ్వరపురం, ఆలమూరు, రాయవరం మండలాల్లో వరి నాట్లు పూర్తి చేయాలని ఆలమూరు వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడిఏ) కె నాగేశ్వరరావు తెలిపారు. ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లో గల నాలుగు మండలాల్లో 56 వేల ఎకరాల్లో వరి సాగు సన్నద్ధం అవుతున్నారని అన్నారు. మే మొదటి వారంలోని సాగునీటికి డెల్టా కాలువల ద్వారా నీటిని వదిలారని ఇప్పటికే కొన్ని మండలాల్లో ఏరువాక ప్రారంభం అయిందని అన్నారు. ఖరీఫ్ కు రైతుల వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఎంటీయూ 1318 రకం వరి విత్తనాలు అధికంగా ఉన్నాయని, అలాగే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఎంటియు 7029 రకం వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని అవసరమైన అన్నదాతలు తీసుకోవచ్చని ఏడిఏ తెలిపారు.
అలాగే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎరువులు కొరత లేకుండా ఒక్కొక్క ఆర్బికేలో 20 టన్నుల ఎరువులను సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని మండలాల్లో రైతు భరోసా నమోదు పూర్తిస్థాయిలో జరిగిందని అన్నారు. జూలై 15 నాటికి వరి నాట్లు పూర్తయితే నవంబరు చివరినాటికి వరి పంట చేతికి వస్తుందని, అకాల వర్షాల నుండి తమ పంటను కాపాడుకోవచ్చని అన్నారు
One Tv News